'పెన్షన్‌ను కనీసం రూ.9 వేలుగా నిర్ధారించాలి'
VZM: EPF పెన్షన్‌ను కనీసం రూ.9 వేలుగా నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్.గోపాలం, వి.శేషగిరి మాట్లాడుతూ.. కార్మికుల నుంచి ఇప్పటివరకు EPF కింద రూ.25 లక్షల కోట్లు నిధులు సేకరించారని, వాటి మీద నెలకు రూ.75 వేల కోట్లు వడ్డీ వస్తుందని తెలిపారు.