విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దు : MLA

NLG: దేవరకొండలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక MLA బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.