మారేడుమిల్లిలో పిచ్చి కుక్కల స్వైర విహారం
ASR: మారేడుమిల్లిలో పిచ్చి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. గ్రామంలోని సత్తి బాబు అనే వ్యక్తి బట్టలు ఉతుకుకోవటానికి దగ్గరలో ఉన్న కాలువకి వెళ్లాడు. పిచ్చి కుక్క అతనిపై దాడి చేసి చేతిపై గాయం చేసింది. మరొక ముగ్గురు గ్రామస్థులపై కూడా పిచ్చి కుక్కలు దాడి చేసాయి. ఇంకా గ్రామంలో ప్రమాదకరంగా మారకుండా పంచాయతీ వారు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరతున్నారు.