కొత్తవలసలో కృత్రిమ అవయవాల పంపిణీ
VZM: కొత్తవలస మండలం మంగళపాలెంలో శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు విశాఖ పోర్ట్ అధారిటీ సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిరీష్( అసిస్టెంట్ కార్యదర్శి), పోర్ట్ సిఎస్ఆర్ ప్రతినిధి ఎంఎస్ఎన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు చేస్తున్న సేవలను కొనియాడారు.