పాలకుర్తిలో మత్స్యకార్మిక దినోత్సవ వేడుకలు
JN: పాలకుర్తిలో ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ చిక్కుడు రాములు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.