'దళితులను విభజించడం మంచిది కాదు'

TPT: దళితులను విభజించడం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం గూడూరుకు చేరుకుంది. దీంతో దానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కెల్లా గొప్పదని ఆయన కొనియాడారు.