విద్యుత్ సరఫరాకు అంతరాయం

NDL: డోన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో కొత్త 11కేవి లైన్ ఏర్పాటు చేస్తున్నారు. పనుల వల్ల బుధవారం పట్టణంలోని ఇందిరనగర్, తారక రామనగర్, కంబలపాడు రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ చేస్తున్నట్లు ఏఈ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.