పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
WNP: అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పానగల్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పానగల్ మండలం తెల్లరాళ్లపల్లిలో బిఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకుల దాడి అమానుషమని అన్నారు.