రెండో రోజు అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న పూజలు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో సౌందర్యలహరి పారాయణం, పూర్వక పార్వతీదేవి హవనము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, వాయనం హోమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకించారు.