ఎన్నికల తర్వాత పీకే మౌన వ్రతం
జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌లోని చారిత్రక భితిహార్వా గాంధీ ఆశ్రమంలో మౌనంగా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. తన భవిష్యత్తు రాజకీయ వ్యూహం, కార్యాచరణపై లోతుగా ఆలోచించడానికి ఈ మౌన వ్రతాన్ని చేపట్టారు. గాంధీ చంపారన్ సత్యాగ్రహం మొదలుపెట్టిన ఈ స్థలం నుంచే పీకే గతంలో తన పాదయాత్రను ప్రారంభించారు.