టిడ్కో అపార్ట్మెంట్లలో పోలీసులు తనిఖీలు
కోనసీమ: మండపేటలో ఉన్న టిడ్కో అపార్ట్‌మెంట్‌లో బుదవారం పోలీసులు కాటన్‌సెర్చ్ నిర్వహించారు. రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 76 మంది సిబ్బంది, 13 టీములు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయా ఇళ్ళలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా, గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నారా అనే దానిపై ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు.