నెలకొరిగిన అరటి పంటను పరిశీలించిన మంత్రి

ATP: యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు క్రిష్ణంనాయుడు పొలంలో అకాల వర్షానికి నెలకొరిగిన అరటి పంటను మంత్రి సవిత పరిశీలించారు. నష్టపోయిన రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ఉద్యాన అధికారులను మంత్రి ఆదేశించారు.