టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా..!

టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా..!

TG: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 19న ప్రారంభించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కానీ, పలు విభాగాల్లో ఇంకా పనులు పూర్తికాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. త్వరలో పనులన్నీ పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.