తత్కాల్ కౌంటర్ వద్ద ఆర్పీఫ్ సిబ్బంది నియామకం
VZM: కొత్తవలస రైల్వేస్టేషన్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్లు జారీ చేసినపుడు రైల్వే రక్షక దళం(ఆర్పీఫ్) సిబ్బంది ఉండాలని ట్విట్టర్‌లో ఏ.రామకృష్ణారావు ఫిర్యాదు చేశారు. రైల్వేశాఖ తక్షణమే స్పందించి రైల్వే రక్షక దళాన్ని కౌంటర్ వద్ద ఏర్పాటు చేసింది. దీంతో అక్రమ దోపిడీని నివారణను అరికట్టవచ్చని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.