'ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి'
MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మాధవ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగమణిలు పాల్గొని మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలను చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీసుకోవాలని కోరారు.