VIDEO: క్షతగాత్రులను పరామర్శించిన తహసీల్దార్

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో గాయపడిన క్షతగాత్రులను మంగళవారం తహసీల్దార్ జ్ఞాన జ్యోతి పరామర్శించారు. సోమవారం రాత్రి మాసాయిపేటలో 20 మందిని ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. గాయపడిన క్షతగాత్రుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆమె పరామర్శించి, మెరుగైన చికిత్స అందజేస్తామని హామి ఇచ్చారు.