'వేసవి సెలవుల్లో జాగ్రత్తలు తప్పనిసరి'
SKLM: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాలని, అలాగే వేసవి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా సమన్వయ అధికారిణి వై యశోద లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా మందస గ్రామ సమీపాన ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ బ్రిడ్జ్ కోర్స్ గురించి ఆరా తీశారు.