VIDEO: వింజమూరులో అర్ధరాత్రి మహిళపై దౌర్జన్యం

VIDEO: వింజమూరులో అర్ధరాత్రి మహిళపై దౌర్జన్యం

NLR: వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద నివాసం ఉంటున్న హబీబా నివాసంలోకి అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తాళం పగలగొట్టి ఇంట్లోని వస్తువులను రోడ్డుపై విసిరేసి బీభత్సం సృష్టించారు. ‘నేను నివాసం ఉంటున్న ఇల్లు నాకు తెలియకుండా నా భర్త అమ్మేశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చాను. నాకు ప్రాణహాని ఉంది, పోలీసులు న్యాయం చేయాలి’ అని ఆమె వాపోయింది.