'రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాలి'

'రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాలి'

ELR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన జరుపు కుంటున్నామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాలన్నారు.