గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తా: అనిల్ కుమార్
ASF: జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని గ్రంథాలయ ఛైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. నూతనంగా నియమితులైన ఆయనను DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పట్టణంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.