టీడీపీని వీడి వైసీపీలోకి వలసలు

కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బనగానపల్లె నియోజకవర్గంలో ఆయా పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. అవుకు పట్టణానికి చెందిన 30 గిరిజన కుటుంబాలు టీడీపీ వీడి వైసీపీలో చేరాయి. వీరికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిజన సంఘం నాయకులు రసూల్ నాయక్, జనార్ధన్ నాయక్, భీముడు నాయక్, తదితరులు పాల్గోన్నారు.