మోహిని అలంకరణలో జ్వాలా నరసింహస్వామి

NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వైశాఖమాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామి మంగళవారం మోహిని అలంకరణలో దర్శనమిచ్చారు. మోహిని రూపుడైన స్వామిని పల్లకిలో కొలువుంచి తిరువీధిలో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. రాత్రి శరభ వాహనంపై స్వామి దర్శనం ఇవ్వనున్నారు.