ఓయూలో పరీక్షల ఫీజు స్వీకరణ

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఎమ్మెస్సీ ఆడియాలజీ, ఎమ్మెస్సీ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫీజును ఈనెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.