పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: ఎస్ఎఫ్ఐ
NLG: దేవరకొండలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం విద్యార్థులకు నెరవేర్చలేని హామీలను ఇచ్చి గద్దనెక్కారన్నారు. ఈనెల 30న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.