VIDEO: సామాజిక విప్లవ పితామహుడు పూలే: ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ(టీడీపీ) కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది(200) జయంతి వేడుకలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సామాజిక విప్లవ పితామహుడు పూలే అని కొనియాడారు. అంబేద్కర్, ఎన్టీఆర్ లాంటి మహానీయులు చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత అన్నారు.