VIDEO: ‘ఉమ్రా యాత్ర పేరుతో డబ్బులు వసూల్'
KRNL: ఉమ్రా యాత్ర పేరుతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి ఆదోనికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ రెండేళ్ల కిందట కోట్ల రూపాయలు వసూల్ చేశారని బాధితులు ఆరోపించారు. గురువారం కర్నూలులో అబ్దుల్ రెహ్మాన్ కదలికలను బాధితులు పసిగట్టి పట్టుకుని నిలదీశారు. రెహ్మాన్ మాట్లాడుతూ.. డబ్బులు తీసుకున్నది వాస్తవమేనన్నారు.