ఘనంగా మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పేద పండితులు ఘనంగా నిర్వహించారు. పవిత్ర శ్రావణమాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని వేకువ జాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరివార దేవతార్చనలు వేద మంత్రోచ్ఛారణలు మధ్య నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.