ధనిక అభ్యర్థి లీమారోస్.. ఎవరు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిగా బరిలోకి దిగిన లీమారోస్ ఎవరనేది చర్చ జరుగుతోంది. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణే ఈ లీమారోస్. తన పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ. 909.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.