ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు డిజిటల్ ప్రకటనల మార్కెట్

ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు డిజిటల్ ప్రకటనల మార్కెట్

భారత డిజిటల్‌ ప్రకటనల మార్కెట్‌ రాబోయే అయిదేళ్ల కాలంలో రూ.2.03 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్‌ పరిశోధన సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది. 2025 నాటికి రూ.1.01 లక్షల కోట్లుగా ఉన్న భారత డిజిటల్‌ యాడ్‌ మార్కెట్, ఏటా 10-15 శాతం వృద్ధితో చెందుతోందని పేర్కొంది. 2025లో ప్రపంచ డిజిటల్‌ ప్రకటనల వ్యయంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.