అమరావతి ప్రత్యేకత ఇదే..!
GNTR: అమరావతి చారిత్రక రాజధాని, బౌద్ధ నిలయం. ఇది ప్రాచీన ఆంధ్రుల వైభవానికి నిలువుటద్దం. క్రీ.పూ. నుంచే రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందింది. ప్రపంచ ప్రసిద్ధ అమరావతి స్తూపం (మహాచైత్యం) ఇక్కడే ఉంది. ఆచార్య నాగార్జునుడు ఇక్కడే బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఇక్కడి 'అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్' శిల్పాలు నేటికీ లండన్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.