రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి KNRవైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా, మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.