అంబేద్కర్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

అంబేద్కర్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

MHBD: కురవి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచందర్ నాయక్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కురవిలోని అంబెద్కర్ భవనం వద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.