మై భారత్ బడ్జెట్ క్వెస్ట్‌కు ఎంపికైన విద్యార్థినులు

మై భారత్ బడ్జెట్ క్వెస్ట్‌కు ఎంపికైన విద్యార్థినులు

KMR: దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి నిర్వహించిన ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్’ పోటీల్లో కామారెడ్డికి చెందిన విద్యార్థులు హర్షిణి, గౌతమి ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ వేదికగా మాట్లాడే అవకాశాన్ని పొందారు. జాతీయ స్థాయిలో యువత గళాన్ని వినిపించేందుకు ఎంపిక కావడం తమకు గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు.