'ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.25వేలు ఇవ్వాలి'

మన్యం: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారికి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు రమణారావు డిమాండ్ చేశారు. ఈమేరకు పాలకొండలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గగుడి నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు.