VIDEO: కుంటలో మొసలి ప్రత్యక్షం
MDK: అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ గ్రామంలోని కుంటలో ఇవాళ మొసలి ప్రత్యక్షమైంది. మూడు రోజుల క్రితం పెద్ద చెరువులో ఓ మొసలి కనిపించగా, ఈరోజు కుంటలో మొసలి కనిపించింది. మొసళ్ళు కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మొసళ్ళ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.