సీఎం పర్యటన రద్దు అనే ఊహాగానాలు నమ్మొద్దు: కలెక్టర్

సీఎం పర్యటన రద్దు అనే ఊహాగానాలు నమ్మొద్దు: కలెక్టర్

PLD: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన రద్దు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని గురువారం కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. జిల్లా అధికారులు యథావిధిగా సీఎం పర్యటన ఏర్పాట్లు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు అనధికారిక వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.