కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్టులు

కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్టులు

దేశవ్యాప్తంగా ఈనెల నుంచి చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రయాణ భద్రతను మెరుగుపరచడం, ఫోర్జరీని నిరోధించడం, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను ఆధునీకరించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిప్‌లో భద్రపరిచిన బయోమెట్రిక్, వ్యక్తిగత డేటాను నకిలీ చేయడం కష్టంగా ఉండే ఈ-పాస్‌పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండనున్నాయి.