ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
KNR: జనగామ - సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కరింనగర్ పట్టణం సప్తగిరికి చెందిన దద్దల నరేష్ అతని భార్య అక్కడికక్కడికే మృతి చెందారు. ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లా నుంచి వస్తుండగా నిద్రమత్తులో కల్వర్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.