డ్రైన్‌లో గుర్తు తెలియని మృతదేహం

తూ.గో: మలికిపురం మండలం శంకరగుప్తం ఉప్పుటేరులో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. మలికిపురం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35-40 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడి శరీరంపై బురదతో కూడిన రంగు తెలియని బనియన్, సిమెంటు రంగు ప్యాంటు ఉందన్నారు. అతని ఆచూకీ తెలిసినవాళ్లు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.