ట్రాఫిక్ పోలీస్‌లకు వైట్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ అందచేసిన డీఎస్పీ

ట్రాఫిక్ పోలీస్‌లకు వైట్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ అందచేసిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎండ నుండి, వడ దెబ్బ నుండి కాపాడేందుకు డీఎస్పీ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మంగళవారం వైట్ హ్యాట్, కూలింగ్ గ్లాస్‌లను ఇవ్వడం జరిగింది. కనిగిరి పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చక్కగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.