కలెక్టర్‌ను కలిసిన ఖాదీ బోర్డు ఛైర్మన్
TPT: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో ఖాదీ బోర్డు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.