VIDEO: అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు
WGL : వర్ధన్నపేట పట్టణ శివారు గురువారం జఫర్గడ్ నుంచి వర్ధన్నపేట వైపుకు అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణపాయం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.