చిరుజల్లులతో కూడిన వర్షం
SRD: కంగ్టి మండల కేంద్రంతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఆకాశమంత నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉంది. సూర్యోదయం సైతం కనిపించలేదు. గత నెలలోనే కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్ వంటలు నష్టపోగా, చేతి కందిన కొద్దిపాటి పంటలు మళ్లీ వర్షంతో చేతికి అందకుండా నష్టపోతాయని రైతులు వాపోయారు.