క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ

BDK: ఖమ్మం పట్టణంలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.