గిరిజనులంటే ఎందుకింత చిన్నచూపు: కోవలక్ష్మి
ASF: ఆదివాసీ గిరిజనులంటే అధికారులకు ఎందుకింత చిన్నచూపు అని ASF ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం రౌట సంకపల్లిలో నిర్వహించిన కొమురం భీమ్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉత్సవాలకు జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంతో గిరిజనులపై వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.