VIDEO: 29వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్ష

VIDEO: 29వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్ష

KNR: హుజూరాబాద్ శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన దీక్ష సోమవారం 29వ రోజుకు చేరుకుంది. నిరసన దీక్షకు ఆరెకటిక కులస్తులు సంఘీభావం తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంప్ యార్డు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.