'ఎమ్మెల్యే నీచ రాజకీయాలు మానుకోవాలి'
KRNL: ఆస్పరి మండల టీడీపీ కన్వీనర్ తిమ్మప్ప, కార్యదర్శి శేషాద్రి నాయుడు ఇవాళ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు ఎస్టీ రిజర్వేషన్ కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో వాల్మీకి రిజర్వేషన్లు, ఆలూరు అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని సూచించారు.