పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ATP: వజ్రకరూరు మండలం రాగులపాడులోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)లో ప్రవేశానికి మే 20లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వెంకట్రామ్ నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 3వ తరగతిలో ఎస్టీ 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1 సీట్లు ఉన్నాయన్నారు. 4వ తరగతి నుంచి 9వతరగతి వరకూ గిరిజన విద్యార్థులతో మాత్రమే భర్తీ చేస్తామన్నారు.