VIDEO: 'బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్చండి'

ELR: పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు నిర్వహిస్తున్న 'నేను బడికి పోతా' కార్యక్రమం లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలని భీమడోలు ఎంపీడీవో స్వర్ణలత ఆదేశించారు. బుధవారం భీమడోలు హైస్కూల్లో ఎంఈవోలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అధ్యక్షతన మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నేను బడికి పోతా కార్యక్రమ లక్ష్యాలు సాధించేందుకు సమీక్ష నిర్వహించారు.