VIDEO: వైభవంగా వీరేశ్వర స్వామి తెప్పోత్సవం

VIDEO: వైభవంగా వీరేశ్వర స్వామి తెప్పోత్సవం

కోనసీమ: మురముళ్ళలో వేంచేసియున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు గోదావరి మాతకు పంచ హారతులు సమర్పించి, స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.